*కాఫీవిత్..‌ఆర్.రమాదేవి పొయెట్రీ..568 -*ఎ.రజాహుస్సేన్..

*అడవి తీగల మధ్యన చిక్కుకుపోయాను"!!
*ఆకాశం అంచుల వరకు నీతో నేనంటూ.."!!
ఈ ప్రేమ కవయిత్రి "ఆర్. రమాదేవి" కి తీగ దొరికితే..అడవిని చుట్టేస్తుంది.

తనదైన.. ఓ ప్రత్యేక డిక్షన్ తో పాఠకుల్ని." మెస్మరైజ్ "చేస్తుంది..‌ప్రేమ  కవిత్వం రాస్తోంది..కవిత్వంలో అవసరమైన దినుసుల్ని ఓ లెక్క ప్రకారం వేస్తుంది..అందుకే రమాదేవి కవిత్వం అంత రుచిగా వుంటుంది..ఈరోజు కాఫీటైమ్ రమాదేవి కవితను మీరూ ఓ సారి చదవండి..!

"గడిచిన కాలంలో నువ్వుంటే బాగుండేది
గడుస్తున్న కాలం నీతో ఉంటే బాగుండేది
గడవబోయేకాలం అంతా నువ్వైతే… బాగుండేది
మిణుగురు లాంటి ఆశ మిణుకు మిణుకు మంటూ…,
ఓయ్..!
అడవి తీగల మధ్యన చిక్కుకుపోయాను
నేను ఎక్కడికోయ్ వచ్చేది ...
నా ఊహలపై చీకటి దుప్పటి కప్పేస్తూ
కోరి మరీ అబద్ధం చెపుతున్నానా..!
ఆకాశం అంచుల వరకు నీతో నేనంటూ…"!!
           ….*ఆర్.రమాదేవి..!!

*త్వమేవాహమ్…అంటే.."నువ్వే నేను‌.
నేనే నువ్వు.." ఇది అద్వైతార్ధం.‌
'భజసేవాయాం'...అంటే భగవంతుణ్ణో
సేవించడమే భక్తి. భక్తికి పరాకాష్ఠ..... భగవంతునిలో భక్తుడు విలీనం కావటం.
అంటేఇద్దరూ ఒకటై పోవటం. అప్పుడు భగవంతుడు,భక్తుడుఅనేభేదం ఉండదు.
ఇద్దరూఒక్కటే..ఇది అలౌకికార్ధం..

ఇప్పుడు లౌకికార్ధంలో ప్రేయసీ,ప్రియులు..
భౌతికంగాఇద్దరూవేర్వేరైనా,మానసికంగా
ఒక్కరే‌‌..రెండు హృదయాలు ఒక్కటై ..
ఒకే గొంతుతో పాడుకునే ఒకే పాట అన్న మాట‌.!
భూత,భవిష్యత్ ,వర్తమాన కాలాల్లో కూడా
ప్రేమ ఒక్కటే..ప్రేయసీ ప్రియులూ ఒక్కరే…
తన సఖుడు ఎప్పుడూ అంటే  మూడు కాలా
ల్లో కూడా తనతోనే,తనతోడే వుండాలన్నది
ఆమె కోరిక.‌ఈ కవితలోని నాయిక కూడా అదే అంటోంది..గడిచిన కాలంలో నువ్వుంటే బాగుండేది.. గడుస్తున్న కాలం నీతో ఉంటే బాగుండేది.. గడవబోయేకాలం అంతా నువ్వైతే బాగుండేది"అని.‌నిజానికిది మిణుగురు లాంటి..ఎందుకంటే నిజ జీవితంలో అలా జరగలేదు‌.,వియోగం,విరహం,నిరీక్షణే జీవితమైంది..

అతడి కోసం వేచివుండటం ,అతడి
సాన్నిహిత్యం కోసంకలలు కనడం మినహా..
కోరుకున్నది..కోరుకుంటున్నదీ ఏదీ నిజం …
కాలేదు..కావడమూలేదు..మిణుకు మిణుకు
మంటూ మిణుగురు లాంటి ఆశతో బతకడం
ఆమె వంతైంది.
'అతడి' పరిస్థితి అలా వుంటే..
తనేమో….
అడవి తీగల మధ్యన చిక్కుకుపోయింది..
ఎక్కడికైనా ఎలా వస్తుంది..?తన ఊహల
పై చీకటి దుప్పటి కప్పేస్తూ,కోరి మరీ అబధ్ధం
చెబుతున్నానా?అన్న సందేహం ఆమెది.

అయితే….
'ఆకాశం అంచుల వరకు నీతో నే వుంటా..'
అన్నది ఆమె నిర్ణయం..కమిట్ మెంట్! నిజ
మైన ప్రేమికులెప్పుడూ..వేరువేరు కాదు.
ఎక్కడున్నా,ఎలా వున్నా.‌ఇద్దరూ ఒక్కటే..
దేహాలు రెండైనా..వారి మనస్సొక్కటే….
హృదయమూ ఒక్కటే…స్పందనలు,ఊపిరీ
ఒక్కటే..అందుకే ప్రేయసి అంటోంది ప్రియు
డితో 'త్వమేవాహమ్' అని.కష్టాల్లో నష్టాల్లో,
సుఖాల్లో దుఃఖాల్లో.‌ఎక్కడున్నా!ఎలావున్నా..
'నువ్వూ.‌నేనూ ఒక్కటే' సుమా! అన్నది …
కవయిత్రి రమాదేవి నిజ ప్రేమ భావన…!!

*ఎ.రజాహుస్సేన్..


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!